Sumanth Prabhas: తొమ్మిది పాటలతో ‘మేమ్ ఫేమస్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Mem Famous’: ‘రైటర్ పద్మభూషణ్’ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు… మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘మేమ్ ఫేమస్’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయనున్నారు.
‘రైటర్ పద్మభూషణ్’కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన కళ్యాణ్ నాయక్… మ్యూజికల్ ఎంటర్‌టైనర్ ‘మేమ్ ఫేమస్’ కోసం తొమ్మిది పాటలను కంపోజ్ చేశారు. ఆస్కార్ వేదికపై తెలుగు పతాకాన్ని రెపరెపలాడించిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఒక్కో పాటను పాడారు. ప్రముఖ గాయని మంగ్లీ మరో పాటని ఆలపించారు. మిగిలిన పాటలను ప్రముఖ సింగర్స్ పాడారు. ఫేమస్ సింగర్స్ పాడిన ‘మేమ్ ఫేమస్’ ఆల్బమ్ చార్ట్‌బస్టర్‌గా మారబోతోందనే ఆశాభావాన్ని నిర్మాతలు వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ అయ్యయ్యో పాటని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా బ్యూటీఫుల్ అండ్ ప్లజంట్ గా వుంది. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్. ‘మేమ్ ఫేమస్’ మూవీ జూన్ 2న విడుదల కాబోతోంది.
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!