ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు ప్రారంభంకానున్నాయి. గతంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ మేరకు సమాచారం అందించారు. రాబోయే మూడు వారాల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే.
Anna Canteens : ఆంధ్రప్రదేశ్ (Andrapradesh) లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దింతో ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను మరోసారి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మంచి కార్యక్రమం వల్ల చాలామంది పేదవారికి కడుపు నిండనుంది. ఇందులో భాగంగానే తాజాగా పొరపాలక శాఖ మంత్రి నారాయణ ఓ కీలక ప్రకటన చేశాడు. వచ్చే మూడు వారాల్లో రాష్ట్ర…
అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లని ప్రారంభించేలా కార్యాచరణకు మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగా రూ. 5కే అన్న క్యాంటీన్లల్లో భోజనం, టిఫిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 203 అన్న క్యాంటీన్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుమతించిందని, వీటిలో చాలా వరకు భవనాల నిర్మాణం జరిగిందన్నారు.
అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలంటూ ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్‌లు అర్జెంటుగా తెరవాల్సిన అవసరం ఉందని లేఖలో లోకేష్ పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నగారి పేరు మీద ద్వేషమో .. ఆకలి జీవులంటే అసహ్యమో తెలియదు కానీ అన్నా క్యాంటీన్‌లను మూసేశారని ఆరోపించారు.అన్న క్యాంటీన్లకు తాళాలు వేయడంతో పేదలు, కూలీలు, అభాగ్యుల ఆకలి తీర్చే…
ఏపీలో టీడీపీ అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తుండటంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ‘పబ్లిక్ స్థలాలు ఆక్రమించి రచ్చ చేయడం, డ్రామాలు వేయడం ఏంటి బొల్లిబాబు? సేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అద్దె భవనాల్లో అన్న క్యాంటీన్స్ పెట్టుకోండి.. రోడ్లు మీ అబ్బ జాగీరు కాదు.. మీ ఇష్టానికి ఎక్కడపడితే అక్కడ టెంట్లు వేస్తామంటే ఎలా?…