ఏపీలో టీడీపీ అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తుండటంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ‘పబ్లిక్ స్థలాలు ఆక్రమించి రచ్చ చేయడం, డ్రామాలు వేయడం ఏంటి బొల్లిబాబు? సేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అద్దె భవనాల్లో అన్న క్యాంటీన్స్ పెట్టుకోండి.. రోడ్లు మీ అబ్బ జాగీరు కాదు.. మీ ఇష్టానికి ఎక్కడపడితే అక్కడ టెంట్లు వేస్తామంటే ఎలా? చీప్ పబ్లిసిటీ కోసం చిల్లర వేషాలు వేయవద్దు చంద్రం’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
పబ్లిక్ స్థలాలు ఆక్రమించి రచ్చ చేయడం, డ్రామాలు వేయడం ఏంటి బొల్లిబాబు? సేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అద్దె భవనాల్లో అన్న క్యాంటీన్స్ పెట్టుకోండి. రోడ్లు మీ అబ్బ జాగీరు కాదు. మీ ఇష్టానికి ఎక్కడపడితే అక్కడ టెంట్లు వేస్తామంటే ఎలా? చీప్ పబ్లిసిటీ కోసం చిల్లర వేషాలు వేయవద్దు చంద్రం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 10, 2022
మరోవైపు వివేకా హత్య కేసులో నిందితుడు గంగాధరరెడ్డి మృతిపై చంద్రబాబు ఆరోపణలు చేయడంపైనా విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతారని.. సహజంగా మరణించినా దానిని తమపై ఆపాదిస్తున్నారని.. అది చంద్రబాబుకే సాధ్యమని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆరోపణలు చేయడమే ధ్యేయంగా చంద్రబాబు ఆయన కుమారుడు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో పార్టీ అధినేత జగన్‌దే తుది నిర్ణయం అని విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ళలోనే హామీలను నెరవేర్చామన్నారు. ప్రతిపక్షాలు ఏకమైనా తమకేమీ భయం లేదని సీఎం చెప్పారని.. ప్రతిపక్షాలలో వారిలో వారికే పొంతన లేదని చురకలు అంటించారు. తమకు పొత్తులతో పనిలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ప్లీనరీ పూర్తయిన తరువాత సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళా ప్రక్రియను ప్రకటించడం జరుగుతుందన్నారు.