Anna Canteens : ఆంధ్రప్రదేశ్ (Andrapradesh) లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దింతో ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను మరోసారి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మంచి కార్యక్రమం వల్ల చాలామంది పేదవారికి కడుపు నిండనుంది. ఇందులో భాగంగానే తాజాగా పొరపాలక శాఖ మంత్రి నారాయణ ఓ కీలక ప్రకటన చేశాడు. వచ్చే మూడు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ లను ప్రారంభిస్తామని., అలాగే సెప్టెంబర్ 21 లోగా 203 క్యాంటీన్లను ప్రారంభించేలా లక్ష్యం పెట్టుకున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ నిర్ణయం చూస్తే అతి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం అన్న క్యాంటీన్లో మొదలు కాబోతున్నాయి.
Organ donation: పెళ్లయిన 50 రోజులకే మరణం..అవయవదానంతో అయిదుగురికి జీవం
ఇకపోతే ఇదివరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో అన్న క్యాంటీన్లో కేవలం ఐదు రూపాయలకే భోజనం పెట్టేవారు. అంతేకాదు టిఫిన్ కూడా అదే రేటుకు అందించేవారు. కొత్తగా తెరిచే అన్న క్యాంటీన్లో రేట్లు ఎలా ఉండబోతున్నాయని చాలామందిలో చర్చ జరుగుతోంది. ఇదివరకు రేట్లే ఉంటాయా..? లేదంటే..? అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా తెరవబోయే అన్న క్యాంటీన్లో కేవలం ఐదు రూపాయలకే టిఫిన్, ఐదు రూపాయలకే భోజనం లభించనుంది. దీంతో కేవలం 10 రూపాయలకే రెండు పూటలా కడుపునిండా తినవచ్చు. అంటే పేదవారిక అన్న క్యాంటీన్లో ఫుడ్ ను అతి తక్కువ ధరకే అందించనున్నారు.
Pavitra Gowda: పవిత్ర గౌడకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటిల్ కి తరలింపు!
ఇకపోతే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్ మొదలైంది. అక్కడ టిఫిన్ తో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా కేవలం సపరేటుగా ఐదు రూపాయలకే అందిస్తున్నారు. అలాగే జగ్గంపేటలోని టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించే అన్న క్యాంటీన్ కూడా పునః ప్రారంభమైంది. జూన్ 19 నుంచి అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పనులు పూర్తిస్థాయిలో మొదలు కాబోతున్నాయి. వచ్చే నెలాఖరులోపు ఈ క్యాంటిన్లకు సంబంధించి మూడు పూటల భోజనం సరఫరా చేసేందుకు ఏజెన్సీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత ఏజెన్సీలు ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత క్యాంటీన్ భవన నిర్మాణం, అలాగే కొత్త పరికరాలు, అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్, అలాగే మౌలిక సదుపాయాలను తీసుకోబడతాయి.