CM Chandrababu: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సకల చరాచర జీవరాసులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఓ ప్రకటనలో తెలిపారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం..
ఆగస్టు 15వ తేదీన తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించిన చంద్రబాబుసర్కార్.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమైంది.. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండో విడత అన్న క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. సెక్రటేరీయేట్ వద్దనున్న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.
మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన అన్న క్యాంటీన్లను అక్టోబర్‌లో ఏర్పాటు చేస్తామన్నారు.
Atchannaidu: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్లను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 2 అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అవుతాం.. 2019 నుంచి కూడా మేమే ఉండి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసేవాళ్లం.. రచ్చబండే నా స్టేజీ... సింపుల్ గవర్నమెంట్ ఉండాలి. నా జీవితాంతం ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేస్తా-సీఎం చంద్రబాబు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు అన్న కాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 180 రెడీ అయ్యాయి.. ఇక, తొలి విడతలో 100 అన్న కాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు.
Minister Narayana: రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతులతో అన్న క్యాంటిన్ లను ప్రారంభిస్తారు అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గతంలో 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్లు నిర్వహించాం.
Anna Canteens: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపడం కోసం కూటమి సర్కార్ మళ్ళీ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు అన్న కాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి.
ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం ఆరున్నర గంటలకు అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.