Anjala Zaveri: ప్రేమించుకుందాం రా.. సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అంజలా జావేరి. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని గృహిణిగా సెటిల్ అయిపోయింది అంజలా..
ప్రేమకథా చిత్రాలకు తిరుగులేదు. అందుకు నాటి ‘పాతాళభైరవి’ మొదలు ఈ నాటికీ వస్తున్న ప్రేమకథా చిత్రాలే నిదర్శనం! ఆ ఉద్దేశంతోనే దర్శకుడు జయంత్ సి.పరాన్జీ తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రానికి ప్రేమకథనే ఎంచుకున్నారు. దానికి ‘ప్రేమించుకుందాం…రా!’ అన్న టైటిల్ నూ నిర్ణయించారు. వెంకటేశ్ హీరోగా డి.రామానాయుడు సమర్పణలో సురేశ్ బాబు నిర్మించిన ‘ప్రేమించుకుందాం…రా!’ చిత్రం 1997 మే 9న విడుదలై విజయఢంకా మోగించింది. ‘ప్రేమించుకుందాం…రా!’ కథలోకి తొంగి చూస్తే – రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ వీరభద్రయ్యకు, రెడ్డప్ప…