ఎప్పటినుంచో వినిపిస్తున్న షారూఖ్, అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా పూణేలో ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పని చేయబోతున్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాటలు కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయబోతున్నట్లు టాక్. ఇంతకు ముందు రెహమాన్, అట్లీ కలసి ‘మెర్సల్, బిగిల్’ సినిమాలకు పని చేశారు.…
ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న పేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఉంటుంది. 2016లో వచ్చిన “జనతా గ్యారేజ్” చిత్రం తర్వాత ఎన్టీఆర్, అనిరుధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి ‘ఎన్‌టిఆర్30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. “ఆర్ఆర్ఆర్” పూర్తవ్వగానే…
“ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సాంగ్ స్పెషల్ ఏంటంటే ఇందులో ప్రత్యేకంగా తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా పాలు పంచుకున్నాడు. జరుగుతున్న ప్రచారం ప్రకారం అనిరుధ్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కి సంగీతం సమకూరుస్తున్నారు.…