యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలో కరోనా కేసులు ఎక్కువ అవుతుండడంతో జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ‘ఎన్టీఆర్ 30’వ సినిమా త్వరలో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన లాంచ్ కానుందని తెలుస్తోంది. ఒకవేళ కరోనా కేసులు తగ్గుముఖం పడితే షూటింగ్ కూడా అతి త్వరలో ప్రారంభం కానుందని అంటున్నారు.
Read Also : సౌత్ సినిమాలా మజాకా… 25 మూవీస్ రీమేక్
ఇక ఈ సినిమాకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ముందు నుంచీ అనుకుంటున్నట్టుగానే ‘ఎన్టీఆర్ 30’కి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే సినిమాలోని ప్రధాన తారాగణం, సిబ్బంది గురించి అధికారిక ప్రకటన రాలేదు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.