నందమూరి బాలకృష్ణ హోస్టుగా “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఫుల్ స్టాప్ లేకుండా దూసుకెళ్తోంది. షోకు వచ్చిన అతిథులు బాలయ్యతో కలిసి చేస్తున్న హడావిడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నవంబర్ 4న ‘ఆహా’లో ప్రీమియర్ అయినప్పటి నుండి రికార్డు స్థాయిలో ఈ షోకు వ్యూస్ వస్తుండడం విశేషం. మొదటి ఎపిసోడ్ లో మంచు కుటుంబం… మోహన్ బాబు, లక్ష్మి మంచు, విష్ణు మంచు, సెకండ్ ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొనగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా…
‘పటాస్’ సినిమాతో రచయిత నుండి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి విజయయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. ఒక చిత్రాన్ని మించిన విజయాన్ని మరో చిత్రంతో అందుకుంటూ ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ దూసుకుపోతున్నాడు. ఈ ఆరేళ్ళలో అనిల్ దర్శకత్వం వహించింది కేవలం ఐదు చిత్రాలే అయినా, తెలుగు సినిమా రంగంలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా అతనికంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల విజయం…
పిడికెడు సినిమాలు తీసినా, గంపెడు పేరు సంపాదించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నాటి క్రేజీ డైరెక్టర్స్ లో అనిల్ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. నవ్వించి, కవ్వించడంలో అందెవేసిన చేయి అనిపించుకున్నారు అనిల్. వినోదం కోరుకొనే వారికి నూటికి నూరుపాళ్లు సంతృప్తిని కలిగించడమే ధ్యేయంగా సాగుతున్నారాయన. ప్రేక్షకుడు కొన్న టిక్కెట్ కు సరిపడా సంతోషాన్ని అందించి మరీ పంపించడం అలవాటుగా చేసుకున్నారు. అనిల్ సినిమాలను చూసినవారెవరైనా ఆ మాటే అంటారు. అనిల్ రావిపూడి 1982 నవంబర్…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఇతర భాషల చిత్రాల రీమేక్ లతో బిజీగా ఉన్నాడు. మరోవైపు క్రిష్, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో కూడా చేస్తున్నాడు. తాజా బజ్ ఏమిటంటే దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. అయితే కథ విషయంలో అనిల్‌కి పవన్ కళ్యాణ్ ఓ కండిషన్ పెట్టాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. హీరోకి భారీ ఎలివేషన్ ఇచ్చే స్క్రిప్ట్‌తో రావద్దని, ఎఫ్ 2, ఎఫ్ 3…
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హిరోలుగా.. తమన్నా, మోహ్రీన్లు హిరోయిన్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్-2 సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈసినిమా కలెక్షన్ల పరంగా కూడా బాక్స్‌ఆఫీస్‌ను షేక్ చేసింది.ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్నను రూపొందిస్తున్నారు. ఎఫ్-3 అనే టైటిల్‌తో తెరకెక్కు తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఎఫ్3 టీంకి వెకీ తన ఇంట్లో టీ పార్టీ ఇచ్చాడు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్ ట్విట్టర్…
2019 బ్లాక్ బస్టర్ ‘ఎఫ్2’కి సీక్వెల్ గా వస్తున్న ‘ఎఫ్3’కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సునీల్, రాజేంద్రప్రసాద్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని ఇటీవలే విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.…
2022 సంక్రాంతి సీజన్ లో సినిమాలను విడుదల చేయడానికి ఇప్పటికే నలుగురు హీరోలు సిద్ధమయ్యారు. “ఆర్ఆర్ఆర్” జనవరి 7న విడుదల కానుండగా, ‘భీమ్లా నాయక్’ జనవరి 12న, ‘సర్కారు వారి పాట’ జనవరి 13న, ‘రాధే శ్యామ్’ జనవరి 14 తేదీల్లో విడుదల కానుంది. మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఎఫ్3” సంక్రాంతికి విడుదలవుతుందని అంతా భావిస్తుండగా, తాజాగా మేకర్స్ ప్రకటనతో ఈ మూవీ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టమైంది. 2019 బ్లాక్ బస్టర్ ‘ఎఫ్2’కి…
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోర్ ఫన్ రైడర్ ‘ఎఫ్3’ షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా భారీ వసూళ్లను సాధించిన ‘ఎఫ్2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.…
వెండితెరపై మరో నట వారసుడి ప్రయాణం మొదలైంది. తపూ విరాట్ రాజ్. అలనాటి హీరో హరనాథ్ సోదరుని మనవడే ఈ విరాట్ రాజ్. తను హీరోగా రూపొందుతున్న’సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, ఆత్మీయుల సమక్షంలో వైభవంగా ప్రారంభం అయింది. నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ నిచ్చారు. ఆకాష్ పూరి తొలి షాట్ కి దర్శకత్వం వహించారు. ఇక నిర్మాత సురేష్…
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ “ఎఫ్2” సీక్వెల్ “ఎఫ్ 3”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ట్రిపుల్ ఫన్ సిద్ధమవుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. “ఎఫ్ 3″ని దిల్ రాజు సమర్పిస్తుండగా, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెహ్రీన్, తమన్నా హీరోయిన్లుగా, రాజేంద్ర ప్రసాద్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ…