Balakrishna and Anil Ravipudi కాంబోలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్ గురించి యంగ్ ఓపెన్ అయ్యాడు. గత ఏడాది ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి, అభిమానులు మరిన్ని అప్‌డేట్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దీని గురించి ఇప్పుడే ఎలాంటి వివరాలు వెల్లడించలేమని, త్వరలోనే సినిమా ఉంటుందని అనిల్ అన్నారు. “బాలయ్య వేరే సినిమా షూటింగ్ లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో నాకు తెలియదు. మే 27న “ఎఫ్3” విడుదలయ్యాక, నా దృష్టి అంతా బాలకృష్ణ సినిమాపైకి మళ్లుతుంది. నేను ప్రస్తుతం స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాను. ఆయనకు ఇంకా కథ చెప్పలేదు. కానీ మేమిద్దరం ఈ చిత్రం కోసం 2-3 సంవత్సరాలుగా ప్లాన్ చేస్తున్నాము” అంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Read Also : RRR : వేటగాడు వచ్చే వరకే… గడ్డ కట్టించే చలిలో చెర్రీ ఫ్యాన్స్… పిక్ వైరల్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ నటిస్తున్న F3 చిత్రం మే 27న విడుదల కానుంది. మరోవైపు బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా, గోపీచంద్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయనున్నారు బాలయ్య.