కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు వేవ్స్ లోను సినిమా రంగాన్ని ఛిద్రం చేసింది.చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకు కరోనా దెబ్బకు వాయిదా పడాల్సి వచ్చింది. ఇక చాలామంది నిర్మాతలు ఈ గడ్డుకాలం నుంచి తప్పించుకోవడానికి ఓటీటీ బాట పడితే కొన్ని చిత్రాలు డేర్ చేసి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. గత కొంత కాలంగా భారీ ప్రాజెక్ట్ ల రిలీజ్ డేట్లపై సందిగ్దత నెలకొన్న విషయం తెలిసిందే. ఇక తాజగా మేకర్స్ వాటన్నింటిని తొలగిస్తూ రిలీజ్ డేట్స్ ని ప్రకటించేశారు. జనవరికి సంక్రాంతి బరిలో దిగాల్సిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ అనూహ్యంగా పోస్ట్ పోన్ కావడంతో ‘ఆచార్య‘ ‘ఎఫ్ 3’ లాంటి సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
తాజగా ఈ రెండు సినిమాలు తమ కొత్త విడుదల డేట్స్ ని ప్రకటించాయి. రెండు సినిమాలో ఒక్క రోజు గ్యాప్ లో థియేటర్లలో పోటీ పడనున్నాయి. ఏప్రిల్ 28 న ‘ఎఫ్ 3’ అడుగుపెడుతుండగా.. ఏప్రిల్ 29 న ‘ఆచార్య’ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “అన్ని ఆలోచించుకొని, అందరి సూచనలు తీసుకొని ‘ఆచార్య’ ఏప్రిల్ 29 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు” అంతేకాకుండా ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25 న థియేటర్లో రిలీజ్ కానుందని కూడా తెలిపారు. దీంతో ఆ డేట్ ని జక్కన్న కి ఇచ్చినట్లు మేకర్స్ తెలిపారు. ఇకపోతే ఎఫ్ 3, ఆచార్య రెండు డిఫరెంట్ కథనాలు. ఒకటి నవ్వులు పూయిస్తే .. ఇంకొకటి ఆలోచింపజేస్తోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది భారీ హిట్ గా నిలుస్తుందో చూడాలి.