నెల్లూరు కోర్టులో జరిగిన అంశంపై తీవ్రంగా స్పందించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. నా మీద 2017లో సోమిరెడ్డి కేసు పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు చార్జిషీట్ చేస్తే కోర్టు ఇది సరైన కేసు కాదని చెప్పింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చార్జిషీట్ ఫైల్ అయ్యింది. దొంగతనాలు చేయాల్సిన అవసరం మాకేమన్నా ఉందా, దొంగతనం చేసి కాగితాలు బయటపడేస్తారా? ఒక పథకం ప్రకారంగా కావాలని చేసి కక్షదారులు చేసి ఉండొచ్చు అనే అనుమానం ఉందన్నారు మంత్రి కాకాణి.
మీకేమన్నా దీనిపై సందేహాలుంటే హైకోర్టు ద్వారా సీబీఐ ఎంక్వైరీ చేయించాలన్నారు. మంత్రి పదవి హోదా కాదు, కేవలం బాధ్యత మాత్రమే, గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉంటాను. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా సహకారం ఉండాలి. జిల్లా పార్టీలో సమస్యలు ఉన్నాయి అనేదానికంటే ఎక్కువ చూపిస్తున్నారు అనిపిస్తుంది. మా అందరి లక్ష్యం 2024లో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే అని మీట్ ది ప్రెస్‌లో మంత్రి కాకాణి అభిప్రాయపడ్డారు.
చిన్న చిన్న తొందరపాట్లు జరిగి ఉంటాయి తప్ప ఎక్కడా సమస్య లేదు. నాకు రెట్టింపు సహకారం అందిస్తామని అనిల్ అన్నారు, దాంట్లో తప్పు ఏముంది? వివాదాస్పద వ్యాఖ్యల గురించి బయట మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్టీ అంతర్గత విషయాలను బయట చర్చించకూడదు. పండించడం, రైతులకు సహకారం అందించడం వ్యవసాయ శాఖ బాధ్యత. మిల్లర్లతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, అలా మాట్లాడితే రైతులకు సమస్య ఉంటుంది. గిట్టుబాటు ధర అంశంలో ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ఇద్దరి మధ్య విబేధాలని మరింత పెంచేందుకు కొంతమంది ఫ్లెక్సీలను చించివేశారు.
Read Also: Meruga Nagarjuna: చంద్రబాబుది కుట్ర రాజకీయం
ఎవరూ ఫ్లెక్సీలను కావాలని తొలగించరు, అనిల్ ఫ్లెక్సీలు నేను చించను, నా ఫ్లెక్సీలు ఆయన చించరు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న సమస్యలన్ని పరిష్కారం జరిపేలా అందరిని కలుపుకుని ముందుకెళ్తామన్నారు మంత్రి కాకాణి. అధికార పార్టీపై బురదజల్లేందుకే పవన్ కళ్యాణ్ యాత్ర చేపడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ నటనకు సరిపోతారు, రాజకీయాల్లో పనికిరాడని ఎద్దేవా చేశారు.