విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనులు జరుగుతున్న తీరును మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనుల కోసం రూ. 5వేల కోట్లు ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టిందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఏపీలోని కర్నూలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కర్నూల్ నగరంలో ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు నందికొట్కూరుకు చెందగిన విజయ్, రుక్సానాలుగా గుర్తించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత వారం ప్రమాణ స్వీకారం అనంతరం సభ వాయిదా పడింది. అనంతరం 14న తేదీ తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. విపరీతంగా చలి పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నాయి. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి.
నేడు గవర్నర్ ప్రసంగంపై తెలంగాణ అసెంబ్లీ చర్చ.. బీఆర్ఎస్ నుంచి చర్చలో పాల్గొననున్న కేటీఆర్, తలసాని, కౌన్సిల్ నుంచి చర్చలో పాల్గొననున్న మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్..
ఎస్సై పోస్టుల నియామకంలో అన్యాయం జరిగిందని తప్పు పిటిషన్ దాఖలు వేసిన పిటిషనర్లపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లు ప్రభుత్వ ఆసుపత్రిని శుభ్రం చేసి సామాజిక సేవ చేసేలా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు పేర్కొంది.