ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ పేర్కొంది. ప్రస్తుతం అల్పపీడనం తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. రాగల 3-4 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉంది. పైన తెలిపిన అల్పపీడనంనకు అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర కోస్తా…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,523 శాంపిల్స్ పరీక్షించగా.. 671 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 11 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,272 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,85,17,990 కు…
పోలీసులు డ్రగ్స్ విషయంలో ఉద్దేశపూర్వంకంగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీ నాయకులను కాపాడేందుకు డిజిపి, విజయవాడ సీపీ తప్పుడు ప్రకటనలు చేశారు అని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర అన్నారు. విజయవాడ కేంద్రంగానే హెరాయిను వ్యాపారం జరిగింది అనడానికి ఆషీ ట్రేడింగ్ సుధాకర్ సంస్థ కట్టిన జిఎస్టీలే రుజువు. శాంతి భద్రతలను కాపాడాల్సిన డీజీపీ హెరాయిన విషయంలో వైసీపీ నాయకులను కాపాడటం సిగ్గు చేటు. గత నెల 20 న హెరాయిన్ పట్టుబడితే నిన్న సీఎం…
06 అక్టోబర్ 2021నుండి వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమునకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. దక్షిణ…
కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది పవన్ కళ్యాణేనని… రాజకీయ పార్టీని టెంట్ హౌస్ లా అద్దెకు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి పేర్ని నాని. మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతల బృందం భేటీ అయింది. ఈ సమావేశం అనంతరం… పవన్ కళ్యాణ్ మరోసారి కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. టాలీవుడ్ హీరో చిరంజీవి తనతో మాట్లాడారని… సినీ ఫంక్షన్ లో జరిగిన ఘటన పై విచారం వ్యక్తం చేశారని పేర్ని నాని వివరించారు. ఆ…
హైదరాబాదులోని జలసౌధలో రేపు ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరుగనుంది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ, తెలంగాణా రాష్ట్రాల అభిప్రాయాలు, అభ్యంతరాలపై సమావేశంలో చర్చించనున్నారు. కేఆర్ఎంబీ పరిధి, సిబ్బంది కేటాయింపు, ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి విశాఖ తరలింపు అంశాలపై సమావేశంలో చర్చ జరుగనుంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పది కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలని ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్రం.…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 71వ రోజు విచారణలో భాగంగా వైఎస్ కుటుంబంలోని వైఎస్ ప్రకాశ్రెడ్డిని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారిస్తుంది. పులివెందుల ఆర్అండ్బీ అతిథిగృహంలో జరుగుతోన్న ఈ విచారణలో వివేక హత్యకు సంబంధించి పలు కోణాల్లో వారిని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకాకు ఏమైనా ఆస్తి తగాదాలు, రాజకీయ విభేదాలు, చంపుకునేంత వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కాగా, వైఎస్ కుటుంబంలో పెద్ద వయసు గల వ్యక్తి వైఎస్…
ఎట్టకేలకు రాష్ట్రంలో థియేటర్ల రీఓపెన్ పై నెలకొన్న సస్పెన్స్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగించింది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా హాళ్లు మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు నాలుగు నెలల విరామం తరువాత 100% సీటింగ్ సామర్థ్యంతో తెలంగాణలో థియేటర్లు తిరిగి ఓపెన్ చేయడానికి అనుమతులు లభించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గతకొంతకాలంగా థియేటర్లను తిరిగి తెరవడంపై సస్పెన్స్ నడుస్తోంది. Read Also : బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ…