ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,979 శాంపిల్స్ పరీక్షించగా.. 154 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 177 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయి లో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల…
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 32,036 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 186 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందరు. ఇదే సమయంలో 191 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,05,39,041 కు చేరింది.. మొత్తం…
కోవిడ్ బారిన పడ్డ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. AIG ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు తెలిపారు. కోవిడ్ తో హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు గవర్నర్. ఆయనకు సంబంధించి వైద్యులు అన్నీ చూసుకుంటున్నారు. సాధారణ స్థితిలో ఆక్సిజన్ స్థాయిలు వున్నాయని వైద్యులు తెలిపారు. ఏఐజీ హాస్పిటల్ లోని వైద్య బృందం పర్యవేక్షణలో గవర్నర్‌కి వైద్య చికిత్స అందిస్తున్నారు. 88…
కేంద్ర పోర్టులు, ఓడరేవులు, జలమార్గాలు మంత్రి సబరనాథ్ సోనోవల్ ని కలిశారు ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి. గతంలో ఈ శాఖలకు కేంద్ర మంత్రిగా మనుసుఖ్ మాండవీయ నిర్వహించిన నేపథ్యంలో, ప్రస్తుత మంత్రి సోనోవల్ కి ఏపీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికను మరోసారి వివరించిన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. రాష్ట్రంలోని 3 పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్ లకు అందించాల్సిన కేంద్ర నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ…
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా వుండాలని సూచించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమేపీ అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని…
వెలుగు జిలుగుల పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు. ముఖ్యమంత్రి జగన్ దీపావళి శుభాకాంక్షలు అన్నారు జగన్. చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి. ఈ పండుగ మీ అందరి ఇంట ఆనందపు కాంతులు నింపాలని, సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ శుభాభినందనలు తెలిపారు జగన్. ఇటు…
దీపావళి పండుగ వచ్చింది దేశంలోని అన్ని ప్రాంతాల్లో టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. నరకాసుడిని వధించిన రోజు కావడంతో ఈ పండుగకు దీపావళి అని పేరు వచ్చింది. దీపావళి విశిష్టత గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, దీపావళి అన్నది మనకు తెలిసి పండుగ పేరు. కానీ, ఆ గ్రామస్తులకు మాత్రం అది పండుగతో పాటుగా ఆ గ్రామం పేరు కూడా. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో ఓ గ్రామం ఉన్నది. ఆ గ్రామం పేరు…
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. అసోం- 5, బంగాల్- 4, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ- 3, బిహార్, కర్ణాటక, రాజస్థాన్- 2, ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్రా, మిజోరాం, తెలంగాణలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరిగిన స్థానాల్లో గతంలో బీజేపీ ఆరు,…