CM Jagan: జగన్‌ని కలిసిన అమెరికా కాన్సుల్ జనరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు అమెరికా కాన్సుల్ జనరల్ ( హైదరాబాద్) జోయల్ రీఫ్‌మెన్. జోయల్ రీఫ్‌మెన్ తన ఫేర్‌వెల్ విజిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అమెరికా – ఆంధ్ర సంబంధాలు మెరుగుపరచడం కోసం, అమెరికా కాన్సులేట్‌కు సీఎం ఇచ్చిన సహకారం, చొరవకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ ప్రభుత్వానికి అమెరికన్ కాన్సులేట్‌కు సత్సంబంధాలు మరింత మెరుగుపడడంలో సీఎం చేసిన కృషిని కొనియాడారు. విద్యా విధానంలో ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను ప్రత్యేకంగా అభినందించారు. వైద్య, ఆరోగ్యరంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్ధవంతంగా కట్టడి చేయడంలో దేశంలోనే ఏపిని ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలిపారని జోయల్ రీఫ్‌మెన్ అన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన కొనియాడారు.
Also Read
- NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
- Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
- Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
- BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
ఆంధ్ర అమెరికా మధ్య పెట్టుబడులు, పరిశ్రమలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షించారు.దేశంలోని గొప్ప నగరాలలో ఒకటిగా రూపొందేందుకు విశాఖపట్నానికి అద్భుత అవకాశాలున్నాయని ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో ప్రస్తావించారు. మహిళలు, బలహీనవర్గాలకు 50శాతంపైగా ప్రాధాన్యతనివ్వడాన్ని కొనియాడారు. అన్ని రంగాలలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న విషయాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, పాఠశాల విద్యపై ముఖ్యమంత్రి తీసుకున్న ప్రోత్సాహక చర్యలను అభినందించారు. విశాఖపట్నంలో అమెరికన్ కార్నర్‌ను ప్రారంభించడానికి యూఎస్ కాన్సుల్ జనరల్‌కు అందించిన సహాయానికి సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అంతేకాక దాని పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు. తన మూడేళ్ళ పదవీకాలంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిని కలిసి వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఇవ్వడాన్ని బట్టి ఆంధ్రా అమెరికా సత్సంబంధాల విషయంలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రత్యేక చొరవను ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ ఎం.హరికృష్ణ వున్నారు.
SRH VS MI: ముంబై, హైదరాబాద్ మధ్య కీలకపోరు… టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!