అనుమతులు లేకుండా ప్రాజెక్టుల పనుల తక్షణమే నిలిపివేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (Krishna River Management Board) తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈనేపథ్యంలో.. కేంద్రం గతంలో ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ గడువు పూర్తయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాసిన బోర్డు, ఈ విషయాన్ని పేర్కొంది. దీంతో.. ప్రాజెక్టుల అనుమతులకు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన గడువు ఈనెల బుధవారం 13తో ముగిసింది. కాగా.. పనులు నిలిపి వేయాలని స్పష్టం చేస్తూ బోర్డు ఆంధ్రా,…
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) తన అప్రతిహత ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. నిజాం కాలంలో పురుడు పోసుకున్న ఈ ప్రగతి రథచక్రానికి ఇవాళ్టితో 90 ఏళ్ళు పూర్తయ్యాయి. జూన్ 15, 1932లో ఆర్టీసీ ఏర్పాటయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) టీఎస్‌ఆర్టీసీ (TSRTC) గా రూపాంతరం చెందింది. ఈ రథచక్రాలు పరుగులు పెట్టడం మొదలై నేటికి 90 వసంతాలవుతోంది. ఇప్పటికీ అలుపు, సొలుపు లేకుండా.. ఆర్టీసీ ప్రయాణమంటేనే సురక్షితం, సుఖవంతం అనే నినాదం వుంది.…
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించారన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆత్మకూరు అభివృద్ధికి గౌతమ్ ఎంతో కృషి చేశారు.మెట్ట ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకుని విక్రమ్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి..సంక్షేమ పథకాలు వల్లే మాకు ఓట్లు వస్తాయి. లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తాం. ఈ ఎన్నికలలో పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. బీజేపీ నేతలు కూడా పోటీకి భయపడుతున్నారు. వచ్చే రెండేళ్లలో మరింత అభివృద్ధి…
అమలాపురం వ్యవహారంలో మంత్రుల తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హోం మంత్రి వనిత మా పేరు వివాదంలోకి లాగారు. హోం మంత్రి వ్యాఖ్యలకు మేం ఆశ్చర్యపోతున్నాం. తల్లి పెంపకం సరిగా ఉండాలంటూ హోం మంత్రి కామెంట్ చేశారు. ఆరేళ్ల బిడ్డ కూడా అత్యాచారానికి గురైతే తల్లుల పెంపకమే తప్పా..? ఎస్సీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత జగన్ ప్రభుత్వానిది. దళితులపై దాడులు జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నెంబర్-1గా నిలిచిందని రామ్ దాస్ అథవాలే స్వయంగా…
ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? పెట్రోల్ , డీజిల్ పై వ్యాట్ తగ్గించడంతో వివిధ రాష్ట్రాలు తగ్గించాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాయి.తెలుగు రాష్ట్రాలు కూడా తగ్గించాలని కేంద్రం కోరింది.
*ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి తిరుమల పర్యటన. ఇవాళ శ్రీకాళహస్తీర్వుడి దర్శనం, తిరుపతి గంగమ్మకు సారెని సమర్పించనున్న స్వామీజీ. * నేడు రాయలసీమ యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కు పిలుపు. రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆనందరావు ను రీకాల్ చేయాలని డిమాండ్ *నేడు రాజ్ భవన్ ను ముట్టడించనున్న రాయలసీమ విద్యార్థి సంఘాలు. అనుమతులు లేవు ఆంక్షలు అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తాం…
ఏపీలో విద్యావ్యవస్థలో లోపాలపై బీజేపీ, బీజేపీ యువమోర్చా ఆందోళన వ్యక్తం చేశాయి. పదవ తరగతి పరీక్ష ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మైలు రాయి. ఏ పని చేయాలన్నా , ఏ ఉద్యోగం చేయాలన్నా మెరిట్ చూస్తారు. అంతటి ప్రాధాన్యత ఉంది పదవ తరగతికి. పదవ తరగతి పరీక్షల్లో మొదటగా తెలుగు పేపర్ లీక్ అయింది. పోనీ తర్వాత జరిగే పరీక్షలు అయినా లీక అవకుండా చూడాలి. ప్రతి పేపర్ లీక్ అయ్యింది. విద్యాశాఖలో ఇంతటీ ఘోరం…
ఆంధ్ర రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతం తూర్పుతీరంలో ఏర్పడిన ఆసాని తుఫాను ఏపీ వైపు దూసుకొస్తుంది. ఈనెల 10 నాటికి తుఫాను రాష్ట్రంలో ప్రవేశిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుంది. ఆ తరువాత ఈరోజు సాయంత్రానికి తూర్పుమధ్య…
ప్రభుత్వ దవాఖానాలంటే అవినీతికి రూపాలనే నానుడి వుంది. దానిని నిజం చేస్తున్నారు తిరుపతిలోని రుయా ఆస్పత్రి సిబ్బంది. ఈమధ్యే అంబులెన్స్ ల దందా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలకు కారణం అయింది. తాజాగా ఆస్పత్రికి వచ్చిన రోగుల్ని పీల్చిపిప్పిచేస్తున్నారు సిబ్బంది. వరుస ఘటనలు జరుగుతున్నా రుయా ఆసుపత్రి సిబ్బంది తీరు మారడం లేదు. తాజాగా డబ్బులు ఇస్తేనే తప్ప వైద్య సిబ్బంది సేవలు అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది రోగి బంధువు. ఆపరేషన్ కోసం రుయా…
ఇదేదో సినిమా టైటిల్ కాదు. నిజంగా జరిగిన సంఘటన. 10వతరగతి అంటే నిండా 15 ఏళ్ళు కూడా నిండవు. పెళ్లి చేసుకునే వయసు కూడా కాదు. కానీ అక్కడ అమ్మాయి, అబ్బాయి పదవతరగతి పూర్తికాకుండానే పెళ్ళి చేసుకోవాలని భావించారు. బాపట్ల జిల్లాలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇన్విజిలేటర్లకు షాక్ ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు పూర్తైన వెంటనే పెళ్లి చేసుకునేందుకు రింగ్స్ తో వచ్చి ఇన్విజిలేటర్లకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చుండూరు…