* ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే. దేశవ్యాప్తంగా వేడుకల్లో పాల్గొననున్న కార్మికులు. * నేడు జి.కొత్తపల్లిలో గంజి ప్రసాద్ అంత్యక్రియలు. ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించడానికి గ్రామానికి రానున్న హోం మంత్రి వనిత, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని *పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి రోజా పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి రోజా. మార్టేరులో జరుగుతున్న బాస్కెట్ బాల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి రోజా *తిరుపతిలో నేడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో…
విజయవాడలో వామపక్ష పార్టీ నేతల సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పై ఉద్యమం ఉధృతం చేయాలని నిర్ణయించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ …దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. భారతదేశం మరో శ్రీలంక తరహాలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు పోరాడతాయన్నారు. ఈనెల 25వ తేదీన సచివాలయాల వద్ద నిరసన చేపడతున్నాం. ప్రజలు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి.…
ఏషియన్ గ్రూప్స్ అధినేత ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ కె.దాస్ నారంగ్ గారి మృతి చెందారన్న విషయం నన్ను వ్యక్తిగతంగా బాధించింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి దూరమవడం చాలా దురదృష్టం.. వారి కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలుపుతూ.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. వల్లభనేని వంశీ.
కామాతురాణాం నభయం నలజ్జ అంటారు. కామంతో కళ్ళు మూసుకుపోయినవాడికి భయం వుండదు.. సిగ్గుశరం వుండవు. విజయవాడలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు కొందరు ఆకతాయిలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అందరినీ కలవరానికి గురిచేసింది. విజయవాడ అరండల్ పేట లోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ స్కూల్ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మద్యం బాటిళ్లు కనిపించాయి. ఈ ఘటనతో పాఠశాలలకు…
మంగళవారం భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా వింటే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. క్రమం తప్పకుండా హనుమంతుడిని ధ్యానించండి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. చిరంజీవి అయిన అంజనీపుత్రుడు కటాక్ష వీక్షణాలు మీకు కలగాలంటే మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి. https://www.youtube.com/watch?v=DvMReMSwqMk
పక్కా ప్లాన్‌తో భార్యను హత్య చేశాడు భర్త. హత్యను మిస్ ఫైర్‌గా చిత్రీకరించబోయే అడ్డంగా దొరికిపోయాడు. బెజవాడ మిస్ ఫైర్ ఘటనలో అసలు నిజాలు బయటకు వచ్చాయి. భార్య రత్న ప్రభను హోంగార్డ్ వినోద్ ఉద్దేశపూర్వకంగానే కాల్చి చంపాడని పోలీసులు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వినోద్, రత్న ప్రభ కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఈ ఘర్షణ సమయంలో వినోద్…