ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించారన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆత్మకూరు అభివృద్ధికి గౌతమ్ ఎంతో కృషి చేశారు.మెట్ట ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకుని విక్రమ్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి..సంక్షేమ పథకాలు వల్లే మాకు ఓట్లు వస్తాయి. లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తాం.
ఈ ఎన్నికలలో పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. బీజేపీ నేతలు కూడా పోటీకి భయపడుతున్నారు. వచ్చే రెండేళ్లలో మరింత అభివృద్ధి సాధిస్తాం అన్నారు మంత్రి కాకాణి. మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ నామినేషన్ కు వైసీపీ కుటుంబ సభ్యులు అందరూ రావడం సంతోషంగా వుందన్నారు. ఈ ఎన్నికలు నాకు కొత్త. అయినా సీరియస్ గా తీసుకుని పనిచేస్తాం అన్నారు. ఈ ప్రాంత అభివృద్దికి కృషి చేస్తాం అన్నారు విక్రమ్ రెడ్డి.

Vikram Reddy
మాజీ ఎం.పి.మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ… గౌతమ్ వారసుడిగా విక్రమ్ ను ఎంపిక చేశాం. ఆత్మకూరులో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గౌతం లేని లోటు ను తీర్చేందుకు విక్రమ్ కృషి చేస్తారు. ప్రజలు అందరూ ఆశీర్వదించాలని కోరారు రాజమోహన్ రెడ్డి. ఇవాళ ఉదయం ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు మేకపాటి విక్రమ్ రెడ్డి.