బాపులపాడు పట్టణంలోని ఇందిరానగర్ లో గడప గడపకు ప్రజాగళం పేరుతో గన్నవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏపీ టెన్త్ 2023-24 ఫలితాలు విడుదలయ్యాయి.. ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారు.. ఎస్ఎస్సీ ఫలితాలను విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్ధి వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు అన్నారు. ఇక, ఈ ఏడాది 6,16,615 మంది పరీక్షలు రాశారు.. 16 లక్షల్లో 86.69 శాతం విద్యార్థులు.. అంటే 5,34,578 మంది ఉత్తీర్ణులు అయినట్టు వెల్లడించారు.. ఇక, వీరిలో బాలురు 83.21 శాతం, బాలికలు 89.17…
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.. ఆ సీటు మార్పుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో.. ఆ పార్టీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నారు.. మొదట భారతీయ జనతా పార్టీలో చేరి.. పోటీ చేయాల్సిందిగా నల్లమిల్లిని కోరారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కానీ, టీడీపీని వీడేందుకు ఆయన ఒప్పుకోలేదు.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నచ్చజెప్పడంతో.. రామకృష్ణారెడ్డి.. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు గ్రీన్…
గత ఐదేళ్లలో జరిగిన మంచిని చూసి ప్రజలందరూ అభివృద్ధికి అండగా నిలవాలని.. సంక్షేమ ప్రభుత్వ విజయానికి సారథులుగా ఉండాలని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.
మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కీలకమైన సమయాల్లో తన యాత్రకు బ్రేక్ ఇస్తూ ఇస్తున్నారు.. ఇక, ఇవాళ "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర కు బ్రేక్ పడింది.. ఉత్తరాంధ్రలో ఎన్నికల వ్యూహంపై కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు జగన్.. సీనియర్ నేతలతో అంతర్గత సమావేశం కానున్నారట.