రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఇవాళ వైసీపీ ఆద్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది వైసీపీ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45కి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. గురువారం నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. మొత్తం 15 అంశాలు ఎజెండాగా ఈ రోజు కేబినెట్ భేటీ జరగనుంది..
Off The Record: సి.రామచంద్రయ్య…. సీనియర్ పొలిటీషియన్. ఒకప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్నారు ఈ ఎమ్మెల్సీ. అయితే… గత ఎన్నికల సమయంలో ఆ పార్టీ మీదే నిప్పులు చెరిగి… మెల్లిగా టీడీపీకి దగ్గరయ్యారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ తరపున వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు సీఆర్. కూటమి సర్కార్ కూడా వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసింది. తాను రాజీనామా చేసిన పదవికే నోటిఫికేషన్ రావడంతో… మరో ఆలోచన లేకుండా ఈ…
కోనసీమ జిల్లాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు జనసేన లీడర్స్ని కంగారు పెడుతున్నాయట. ముఖ్యంగా తమ అధినాయకుడి ఫ్యాన్స్ వ్యవహారశైలి గ్లాస్ లీడర్స్ని గందరగోళంలో పడేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళ తీరు ఇలాగే ఉంటే... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పార్టీ ఇరుకున పడటం ఖాయమన్న చర్చ కూడా జరుగుతోంది జనసేన వర్గాల్లో.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీ నేతలను బ్యాలెన్స్ చేసే విధంగా వివిధ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మూడు పార్టీలకు న్యాయం చేసే విధంగా ఈ నియామకాలు చేపడుతూ వచ్చారు.. ఇక ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను నియమించింది కూటమి ప్రభుత్వం..
శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్గా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టే సాయిని నియమించింది కూటమి ప్రభుత్వం.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఓ ధర్నాలో కార్యక్రమంలో పాల్గొన్న సాయిని.. అప్పటి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ చెంప దెబ్బలు కొట్టి.. పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.. సాయిని కొట్టిన వీడియోలు అప్పట్లో వైరల్గా మారాయి.
పాకాల మండల పరిధిలో ఉన్న అటవీప్రాంతంలో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. అటవీప్రాంతంలో డెడ్ బాడీలు దొరకడంతో వారిని ఎందుకు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విషయమై పాకాల పోలీసులు తంజావూరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికి ఒక మహిళ, పురుషుడి డెడ్ బాడలకు పోస్టుమార్టం చేయగా.. వారి నోటిలో గుడ్డలు, గ్లౌజులు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లుగా తెలిసిందని పోలీసులు తెలిపారు. వారిలో మృతుడు తంజావూర్ కు చెందిన కలై…
రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ అర్ధం కావాలంటూ.. అందరికీ అర్థమయ్యే రీతిలో అసెంబ్లీలో ప్రసంగించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీఎస్టీ ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో కమర్షియల్ టాక్స్ చూశాను.. తర్వాత వ్యాట్ వచ్చింది.. వేరే రాష్ట్రంలో నుంచి వస్తువులు వస్తే ఎంట్రీ టాక్స్ ఉండేది.. టాక్స్ అనేది కాంప్లికేటెడ్ అయిపోయిందన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు జీఎస్టీ ప్రవేశ పెడదాం అనుకున్నారు. ఇప్పుడు మోడీ ప్రధానిగా జీఎస్టీ అమలు చేస్తున్నారన్నారు.. అయితే,…