AP Pensions: ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. నిన్నటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది.. ఈ రోజు, రేపు కూడా ఈ ప్రక్రియ కొనసాగనుండగా.. ఈ రోజు ఉదయం నుంచి పెన్షన్ డబ్బులు డ్రా చేయడం కోసం బ్యాంకుల దగ్గర వేచి ఉన్న ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు వృద్దులు. కొందరికి అకౌంట్లు పనిచేయకపోవడం.. మరికొందరికి డబ్బులు పడకపోవడంతో ఉసురుమంటూ వెను తిరుగుతున్నారు వృద్దులు. కొందరికి ఆధార్ లింకు కాకపోవడం, మరికొందరికి అకౌంట్లు ఫ్రీజ్ కావడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు..
Read Also: Pradeep Ranganathan : మరోసారి లవ్ టుడే కాంబినేషన్ రిపీట్.. ఈ సారి దర్శకుడు ఎవరంటే..?
ఇక, అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది.. రాయచోటిలోని కెనరా బ్యాంకుకు పెన్షన్ కోసం వెళ్లి బ్యాంక్ ముందు కుప్పకూలిన వృద్దుడు అక్కడికక్కడే కన్నుమూశాడు.. మృతుడు సుబ్బన్న (80)గా గుర్తించారు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకుకు చెందిన ముద్రగడ సుబ్బన్న.. పెన్షన్ కోసం వెళ్లి.. బ్యాంకు వద్ద కుప్పకూలి మృత్యువాత పడ్డారు. ఎండలు మండిపోతూ ఉండడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కాగా, గత నెల గ్రామ, వార్డు సచివాలయల దగ్గర కూడా పెన్షన్ డబ్బుల కోసం పడిగాపులు పడి.. కొందరు వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం విదితమే.