టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు సంతోషంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టం ఉండదని.. ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడని ఆయన ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాల్లో హోరెత్తుతోంది. ఇక మిగిలింది 4 రోజులే ఉండడంతో ఢిల్లీ నుంచి అగ్రనేతలు మొదలుకొని రాష్ట్రంలోని స్టార్ క్యాంపెయినర్లు అంతా ప్రచార రంగంలోకి దూకారు. పోటాపోటీగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో దూసుకుపోతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కొట్లాట జరిగింది. మంత్రి తానేటి వనిత ప్రచారంలో వివాదం చెలరేగింది. నల్లజర్లలో ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద బైక్ సైలెన్సర్లతో హంగామా సృష్టించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 6వ తేదీన ఏపీలో పర్యటించిన ప్రధాని.. నేడు మరోసారి ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు.
తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న ఏపీ జనం ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో.. ప్రజలు వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొన్ని చోట్ల వాతావరణం చల్లబడగా.. మరికొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో.. నగరం అతలాకుతలం అయ్యింది.
ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల నిలిపివేయాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈసీ ఆదేశాలతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిలిచి పోయిందని పిటిషనర్ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో కరువు మండలాల్లో రైతుల ఇబ్బందులను గుర్తించటానికి 2023లోనే ప్రభుత్వం కలెక్టర్లతో కమిటీ వేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. 108 కరువు మండలాల్లో 6.95 లక్షల రైతులను గుర్తించి గత ఏడాది…
మంత్రి ఆర్కే రోజా.. మరోసారి నగరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెబల్స్ ఆమెకు తలనొప్పిగా మారారు.. అయితే, రెబల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రోజా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించడానికి అందరూ ఏకమయ్యారన్న ఆమె.. ఎంతమంది ఒక్కటైనా పందులు పందులే.. సింహం సింహమే అన్నారు.
తప్పు పట్టిన సైకిల్‌ను బాగుచేసుకునేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ పరిస్థితి ఉంది కాబట్టే.. సైకిల్ బెల్ మోగిస్తు ప్రజలను భ్రమ పెడుతున్నారనీ విమర్శించారు