నల్లజర్ల మండలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడిని ఖండిస్తూ ద్వారకాతిరుమలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసన కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్కి వ్యతిరేకంగా ప్రధాని వ్యవహారం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. విజయవాడలో మోడీ పర్యటనతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని క్వారీలలో ఉన్న నీటిగుంటలో పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారిద్దరు అక్కాచెల్లెళ్లని తెలిసింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు. కేశినేని నాని,షేక్ ఆసిఫ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రతి గడపకు వెళ్తుంటే మంచి రెస్పాన్స్ వస్తోందని ఆమె వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని నందిగామ మండలంలోని రాఘవపురం, పల్లగిరి, కమ్మవారిపాలెం గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతకు రానున్న ఎన్నికలలో మాదిగలంతా కలిసి సంపూర్ణ మద్దతును అందించి పార్లమెంట్ సభ్యురాలిగా గెలిపిస్తామని ఎమ్మార్పీఎస్ ఉత్తర కోస్తాంద్ర అధ్యక్షుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు తెలిపారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్షోకు భారీ ఎత్తున ప్రజలు వైసీపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ రోడ్ షోలో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు.