విజయవాడ బందర్ రోడ్డులో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో ముగిసింది.. గంట పాటు బందర్ రోడ్డులో రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోడీ.. ఈ రోడ్ షోలో వాహనంపై ప్రధాని మోడీకి ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిలబడి.. దారిపొడవునా.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.. ప్రధాని మోడీ రోడ్ షో.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిలో కొత్త జోష్ నింపిందని కూటమి నేతలు చెబుతున్నారు..
హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టు.. ఇరువర్గాల వాదనలు వింది.. ఆ తర్వాత షర్మిల, సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారన్న పేర్కొంది.. షర్మిల, సునీతకు, పులివెందుల టీడీపీ అభ్యర్థి మా రెడ్డి రంగారెడ్డికి అలియాస్ బీటెక్ రవికి రూ.10 వేల జరిమానా విధించింది కడప కోర్టు.. ఆ జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలన పేర్కొంది కడప కోర్టు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి బహిరంగసభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు.. ఏపీ వికాస్ మోడీ లక్ష్యంగా పేర్కొన్నారు..
చిరంజీవికి ప్రజలు అంటే లెక్క లేదు.. ప్రజా సేవ అని పార్టీ పెట్టి మూసేసాడని ఫైర్ అయ్యారు పోసాని.. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదని దుయ్యబట్టిన ఆయన.. సినిమా లానే రాజకీయాల్ని కూడా బిజినెస్ లా చూశాడని ఆరోపించారు. 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కి అమ్మేశాడు.. రాజకీయాలు వద్దని సినిమాలోకి వెళ్లాడు.. ఇప్పుడు మళ్లీ రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు.. ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..