ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటుచే సిన స్ట్రాంగ్ రూములను విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది.. జీరో వైలెన్స్ గా పోలింగ్ ప్రక్రియ కొనసాగిందన్నారు.
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. అచ్చంపేట మండలం వేల్పూర్ లో మరోసారి వివాదం చెలరేగుతుంది. నిన్న ( సోమవారం ) పోలింగ్ బూత్ దగ్గర గ్రామంలోని రెండు వర్గాల వారికి గొడవ జరిగింది.
ఈవీఎంల భద్రత కోసం మూడు అంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు, సివిల్ పోలీసులు కూడా ఈవీఎంలకు భద్రతగా ఉంటారు.. ఈవీఎంల భద్రత గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అని వెల్లడించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. 26వ పోలింగ్ బూత్ లో తెలుగు దేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతల మధ్య ఘర్షణతో వివాదం చేలరేగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు అయిందని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈసీ లెక్కల ప్రకారం 78.36 శాతం మేర పోలింగ్ అయినట్లు పేర్కొన్నారు.
ఉదయం నుంచి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు స్పష్టంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారని.. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఏపీలో ఇంకా 3500 పోలింగ్ స్టేషన్లల్లో పోలింగ్ జరుగుతోందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు. ప్రతి చోటా 100 నుంచి 200 మంది ఉన్నారన్నారు. పది గంటలకల్లా అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.