ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ సమయంలో తాడిపత్రిలో జరిగిన అలర్ల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జేఎన్టీయూలో 8 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ , 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. అలాగే, కౌంటింగ్ కేంద్రాల దగ్గర రెడ్ జోన్, నో ఫ్లై జోన్ లను అధికారులు ప్రకటించారు. 500 మీటర్ల పరిధి వరకు సీసీ కెమెరా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర బలగాలు, ఏపీఎస్పీ బెటాలియన్లు, స్థానిక పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Read Also: Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే?
అలాగే, తాడిపత్రి, తిరుపతి అల్లర్ల ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు, అనంతపురం జైళ్లలో ఉంచితే సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉందని ముందస్తుగా చర్యలు చేపట్టారు. అరెస్ట్ అయిన నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. గత రెండు రోజులుగా అరెస్ట్ అయిన వారిని కలుసుకునేందుకు కడప సెంట్రల్ జైలుకు బంధువులు బారులు తీరారు. అయితే, తిరుపతి,చంద్రగిరి అల్లర్ల కేసులో 14 మందిని కడప సెంట్రల్ జైలుకు తరలించగా.. ఎన్నికల రోజు తాడిపత్రిలో చెలరేగిన అల్లర్ల కేసులో 91 మందిని కూడా పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు.