మాచర్ల ప్రాంతంలో జరిగిన ఘటనలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం.. పిన్నెల్లి సోదరులు సిద్ధమేనా? అంటూ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సవాల్ విసిరారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర ఉండి మరి ఈవీఎంలు ధ్వంసం చెపించాడు.. తాలిబన్ ముఠాలాగా మొహాలకు ముసుగులు ధరించి విధ్వంసం చేశారు.. నువ్వు భయపెడితే భయపడే వాడు ఎవరు లేరు.. పోలీసు ఆదేశాలు బేఖాతరు చేస్తూ అర్థరాత్రి పరారయ్యాడు.. పిన్నెల్లికి చట్టాన్ని గౌరవించడం రాదు అని ఆయన మండిపడ్డారు. కారంపూడి, రెంటాల్ల ప్రాంతాల్లో పిన్నెల్లి వెంకట రామిరెడ్డి, వాహనాల్లో తిరుగుతూ సినీ ఫక్కీలో కర్రలు, రాళ్లతో దాడులు చేయించాడని విమర్శించారు. పిన్నెల్లి సోదరులకు ప్రజాస్వామ్య విలువలు తెలియవు అని జూలకంటి బ్రహ్మారెడ్డి మండిపడ్డారు.
Read Also: Chit Fund Fraud: బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ.. బాధితుల ఆందోళన..
పరామర్శకు వెళ్ళే వాళ్ళు ఆయుధాలు తీసుకుపోతారా?.. అందుకే మాచర్లలో తాలిబన్ ప్రభుత్వం పాలిస్తుందన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు అని మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్ల నీ తాత జాగీరు కాదు.. పోలీసు అధికారులు చూస్తుండగానే నాపై కారం చల్లారు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు పారిపోయాడో సమాధానం చెప్పాలి.. నువ్వు ఏ తప్పూ చేయక పోతే.. ఏ భయం నిన్ను వెంటాడుతుందో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రజల మాన ప్రాణాలతో ఆడుకున్నావు.. మా ప్రభుత్వం రాగానే మాచర్లలో జరిగిన అరాచకాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని జూలకంటి బ్రహ్మారెడ్డి వెల్లడించారు.