ఏపీలో ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. సాయంత్రం వరగ్గా ప్రశాంతంగా జరిగిన పోలింగ్.. 5 గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు గ్రూపులుగా విడిపోయిన టీడీపీ, వైసీపీ శ్రేణులు నాటుబాంబులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు.
మంత్రి అంబటి రాంబాబు ఏపీ ఎన్నికల అధికారి(సీఈవో) ఎంకే మీనాను కలిశారు. పల్నాడులో పొలిటికల్ హింస మీద ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని.. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
ఏపీలో ఎన్నికలు ముగిసినా గొడవలు మాత్రం ఆగడం లేదు. సోమవారం పోలింగ్ సమయంలో చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సోమవారం ముగిసింది. ఓటర్లు బస్సులు, ఫ్లైట్లు, రైళ్లలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండా వానను కూడా లెక్క చేయకుండా జనం ఓటేశారు. పలు చోట్ల హింసాత్మక దాడులకు కూడా భయపడకుండా ఏపీ ఓటర్లు చైతన్యంతో తమ తీర్పును ఈవీఎం బాక్సులలో నిక్షిప్తం చేశారు.
ఎన్నికల కమిషన్ విచారించి నిర్ణయం తీసుకోవాలి.. చంద్రబాబు మోసగాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా చెత్తబుట్టలో వేశాడు.. జగన్ మొనగాడు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాడు.. మోసగాడు కావాలో మొనగాడు కావాలో ప్రజలే నిర్ణయిస్తారంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
కడప జిల్లా జమ్మల మడుగులో నిన్న ( సోమవారం ) వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య తోపులాట, రాళ్లదాడి చేసుకున్నారు. నేడు మళ్ళీ తిరిగి కవ్వింపు చర్యలకు వైసీపీ, టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో మా అంచనా ప్రకారం 81 శాతం మేర పోలింగ్ నమోదు కావచ్చు అని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెటుతో కలుపుకుని ఇప్పటి వరకు సుమారుగా 79. 40 శాతం నమోదైనట్టు చెప్పొచ్చు.
కడప జిల్లాలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. దాదాపు 86 శాతం మేర ఓట్లు పోలైనట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం జిల్లాలో ఓట్లు 2,42, 556 ఉన్నాయి. ఇందులో పురుషులు 1, 02, 789 ఓట్లు మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మహిళలు 1, 07, 449 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 27 స్ట్రాంగ్ రూములు 4 బిల్డింగులలో ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, మైలవరం నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేశామన్నారు.