ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీగా నమోదు అవుతోంది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం 70 శాతానికి చేరువగా వెళ్లింది.. 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది..
ఇప్పుడు రాజకీయాల్లో లేను.. అలాగే, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఓటింగ్ బాగా జరుగుతుంది అని లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో క్రమంగా ఓటింగ్ శాతం నమోదు అవుతోంది.. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. క్రమంగా పుంజుకుంది.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలంలోని కేఎస్ఎన్ కాలనీ కొండ్రుప్రోలు మెట్ట వేపచెట్టు దగ్గర వైసీపీ నేతలు ఓటుకు నోటు నగదు పంపిణీ నిలిపివేయడంతో ఆందోళన చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద ఎత్తున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేసేందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఎన్నికల సమయంలో అనేక దుష్ప్రచారాలకు తెర లేపుతున్నారని మండిపడ్డారు.