పల్నాడు జిల్లాలో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్‌కు ముందే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ కొనసాగుతుంది. రెంటాల, పాకాలపాడు, దూళిపాళ్ల, దాచేపల్లి, అచ్చంపేట, గురజాల గ్రామాల్లో పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకుంటున్నారు.
PM Modi: ఈ రోజు నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 96 ఎంపీ స్థానాల్లో 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందులలోని భాకరాపురంలోని జయమ్మ కాలనీలో అంగన్వాడి రెండో సెంటర్లో 138 బూత్ నెంబర్ లో తన ఓటును వేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకే ప్రధాన పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు.
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల ముందు.. ఓటర్లకు ప్రలోభాలు కొనసాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా.. డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈసీ ఎన్ని పకడ్బంధీ చర్యలు చేపట్టినప్పటికీ డబ్బులు, మధ్యం పంపిణీ జరుగుతుంది. అంతేకాకుండా.. డబ్బుల పంపిణీ విషయంలో కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి.
ఏపీలో రేపు జరగబోయే పోలింగ్ పై భారీ వర్ష సూచన ఉంటుందని ఆందోళన చెందుతున్న అధికారులకు, ఓటర్లకు విశాఖ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పోలింగ్ నిర్వహణకు వరుణుడి ముప్పు తక్కువే అని సూచించింది. రేపు రాష్ట్రంలో వర్ష ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్ష సూచన ఉంటుందని.. భారీ వర్ష సూచన లేదని పేర్కొన్నారు.