ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా.. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వెరీ క్లారిటీగా ఉన్నామని.. 175 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేం మేలు చేస్తేనే ఓటేయండని అడిగిన జగన్.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారన్నారు.
బెంగుళూరు రేవ్ పార్టీలో తనకు సంబంధించిన వాళ్లెవరూ లేరని.. ఈ విషయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ విషయంలో తనపై తప్పడు ప్రచారం చేస్తున్నారని.. సోమిరెడ్డి చంద్రమోహన్ ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి ఆరోపణలపై స్పందించారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. తనపై బ్రహ్మనంద రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. మేము ఎటువంటి దాడులు చేయలేదని పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.
ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను భారీగా పెంచారు. మళ్లీ ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ రోజు జరిగిన హింసతో ఏపీ హై అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు ( కృష్ణబాబు ) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న కృష్ణబాబు.. మృతదేహాన్ని రేపు సాయంత్రం స్వగ్రామం దొమ్మేరుకు తీసుకు వెళ్లనున్నట్లు బంధువులు ప్రకటించారు.