ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ లో పాఠ్యంశంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని ఎంపిక చేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో టెన్త్ కొత్త పుస్తకాల్లో బన్నీ ఉత్సవానికి చోటు దక్కింది. ప్రతియేటా దసరా రోజు హోలగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో కర్రల సమరం గురించి ఈ పాఠ్యాంశంలో పొందుపర్చబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్–2024 యాత్ర నేడు (సోమవారం) ప్రారంభంకాబోతుంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2, 580 మంది హాజీల పవిత్ర యాత్రకు ఏర్పాట్లు పూర్తైయ్యాయి. ఇవాళ ఉదయం 8 : 45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తొలి విమానం స్టార్ట్ కానుంది.
Amit Shah: లోక్సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. జూన్ 1న చివరిదైన ఏడో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఎంపీ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.
పోలీసులు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని.. అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలు, గొడవలు కారణంగా ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుటోంది. కౌంటింగ్ ప్రక్రియను పకడ్బంధీగా చేసేందుకు మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. కేంద్ర బలగాలతోపాటు స్థానిక పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
మాంసాహార ప్రియులకు చేదువార్త ఇది. గత కొన్ని రోజులగా ఏపీ, తెలంగాణలో చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలతో పాటు చికెన్ రేట్లు కూడా మండిపోతూ సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కిలో చికెన్ ధర 'ట్రిపుల్' సెంచరీ దాటింది.
ఇటీవల ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆస్తి గొడవల వ్యవహారంలో అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టింది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం మన్నూరులో ఆస్తి కోసం వృద్ధురాలిని కిడ్నాప్ చేసింది.