నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో కట్టుకున్న భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు ఓ కసాయి మొగుడు. మద్యం మత్తులో భార్య సుగుణమ్మ (48) ను కిరాతకంగా గొడ్డలితో హత్య చేశాడు భర్త వడ్డే రమణ.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుఫాన్‌గా మారింది. దానికి రేమాల్‌గా నామకరణం చేశారు. రేమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది.
సార్వత్రిక ఎన్నికలల్లో ఘర్షణలు జరిగిన 15సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. వివిధ కేసుల్లో 666మంది నేర చరిత్ర గల వ్యక్తులను గుర్తించామని పేర్కొన్నారు. రౌడీ షీటర్ల మీద ప్రత్యేక నిఘా పెట్టామని..చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ చేస్తామన్నారు. మాచర్ల, నరసరావుపేటలో పోలీస్ భద్రతను పెంచామని చెప్పారు. బైండొవర్ కేసుల్లో ముద్దాయిలను జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు. భారీ భద్రత CRPS బలగాలతో పల్నాడులో భద్రతను పెంచామని వెల్లడించారు. ఈనెల 4వ…
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించామని.. శుక్రవారం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి మా వినతిని తెలిపామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎలక్షన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే గ్రామ గ్రామాన పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.
కంబోడియాలో చిక్కుకున్న విశాఖ వాసులకు విముక్తి కల్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ కంబోడియా కొనసాగుతోంది. మొదటి రోజు 25 మందికి విశాఖ పోలీసులు విముక్తి కలిగించారు. కంబోడియాలో విశాఖకు చెందిన మొత్తం 58 మంది యువకులు చిక్కుకున్నారు.