ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపట్నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తోంది. రేపు(జులై 1న) రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది.
అరకు కాఫీపై ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అరకు కాఫీ బాగుంటుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. గిరిజనుల సాధికారత అరకు కాఫీతో ముడిపడి ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నాటి ఫొటోలను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు