Chinta Mohan: ఏపీకి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుంది…!
- ఏపీకి ప్రత్యేక హోదా తొందరలోనే వస్తుంది అంటున్న చింతామోహన్..!
- టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన..
- గత ఐదేళ్లుగా ఇచ్చిన బ్రేక్ దర్శనం వివరాలు బయట పెట్టాలని డిమాండ్..
- జూపార్క్ ను వడమాలపేటకు తరలించి ఇక్కడ టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్న కేంద్ర మాజీ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా తొందరలోనే వస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్.. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆయన.. తిరుమలలో గత ఐదేళ్లుగా ఇచ్చిన బ్రేక్ దర్శనం వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.. ఇక, జూ పార్క్ ను వడమాలపేటకు తరలించి ఇక్కడ టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం నేను ఎంపీగా ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. భూమి పూజ చేసి పునాది రాయి వేశాం.. క్రికెట్ స్టేడియం కోసం వేసిన పునాది రాయి అనాది రాయి కాకుండా నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు..
Read Also: Balkampet Yellamma: బల్కంపేట రోడ్డు మూసివేత.. మళ్లింపు ఇలా..
Also Read
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
ఇక, తిరుపతిలో పది ప్రాంతాల్లో పిల్లలకు ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు చింతామోహన్.. ఇందుకు కార్పొరేషన్ కమిషనర్ టాప్ ప్రియారిటీ ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదు.. వైఎస్.., వైఎస్ జగనే కారణంగా చెప్పుకొచ్చారు.. కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ జగన్ ఉంటే.. విభజన జరిగి ఉండేది కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కాంగ్రెస్ ను బలహీన పర్చారని మండిపడ్డారు.. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా తొందరలోనే వస్తుందని పేర్కొన్నారు. కాగా, కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ.. రాహుల్ గాంధీతో సహా.. కాంగ్రెస్ నేతలు ప్రకటించిన మాట విదితమే.. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోగా.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఇప్పటి నేతలు అంటుండగా.. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాత్రం.. త్వరలోనే ఏపీకి ప్రత్యేక హోదా అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తాజావార్తలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..