Minister Satya Kumar Yadav: ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ.. మంత్రి సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు
- తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు..
- కేసీఆర్.. జగన్ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆరోపణ..
- రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శలు..
- సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు.. రేవంత్ రెడ్డి భేటీ కావడం అభినందనీయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: విభజన సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నడుంబిగించారు.. అందులో భాగంగా.. ఈ రోజు హైదరాబాద్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కాబోతున్నారు.. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. గతంలో కేసీఆర్, జగన్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆరోపించిన ఆయన.. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు.. అయితే, రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం ఇద్దరు సీఎంలు భేటీ కావడం అభినంద నీయం.. విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ 9, 10 అంశాల మీద మంచి వాతావరణంలో చర్చలు జరుగుతాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Group-2 Postponed: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా..?
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ఇక, చంద్రబాబు లెటర్ రాయటం.. రేవంత్ రెడ్డి స్పందించటం బాగుంది అన్నారు మంత్రి సత్యకుమార్.. ఆస్తులు, నీటి పంపకాలు, ఉద్యోగుల పంపకాలపై స్నేహ పూర్వక చర్చ జరగనుంది.. రాజకీయాలకు అవకాశం లేకుండా చట్ట ప్రకారం ఉన్న అంశాలపై చర్చకు ముందుకు రావటం అభినందనీయం అన్నారు. మొదట ఐదేళ్ళపాటు కేంద్రంలో ఉన్న ఎన్డీయే ఏపీకి అండగా నిలిచింది.. కేసీఆర్, జగన్ ప్రభుత్వాల మధ్య సమస్యల పరిష్కారంపై స్పందన లేకపోవటంతో కేంద్రం ఏమీ చేయలేక పోయిందన్నారు. ప్రస్తుత సమావేశం ద్వారా ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను అన్నారు. విభజన చట్ట ప్రకారం మాత్రమే ఆస్తులు, ఆదాయ, సహజ వనరుల పంపకాలు జరగాలి.. అంతేకాదు.. చట్టం దాటి పెట్టిన డిమాండ్స్ పై చర్చ జరపాలి అన్నారు. రాజకీయాలు పక్కన పెడితే ఏపీకి అన్యాయం జరిగింది అనేది వాస్తవం.. రాజధాని లేదు, ఏపీకి ఆదాయం లేదు, తెలంగాణకు మిగులు ఆదాయం ఉంది అన్నారు. మరోవైపు.. డిమాండ్స్ పెట్టడం సరికాదు, అత్యాసపరమైన డిమాండ్స్ మంచిదికాదు.. పరిణితి ఉన్న నాయకత్వం చర్చలు బాగానే జరుగుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం మొదటి నుంచి అన్యాయం జరిగిన ఏపీకి అండగా ఉంది.. తర్వాత వైసీపీ అభివృద్ధి నిరోధక చర్యలతో కేంద్రం ఏమీ చేయలేక పోయిందన్నారు. సమావేశంతో రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను అన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!