Minister Satya Kumar Yadav: వర్షాకాలంలో ఆ నీరు తాగండి.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..!
- వర్షాకాలంలో ఇబ్బంది పెడుతున్న సీజనల్ వ్యాధులు..
- కీలక సూచనలు చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
- వర్షాల సమయంలో కాచి చల్లార్చిన నీరు తాగాలని సూచన..
- ఏ నీరు పడితే అది తాగి ప్రాణాల మీదుకు తెచ్చుకోవద్దన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేశారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. వర్షాల సమయంలో కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగండి అని సూచించిన ఆయన.. ఏ నీటినిపడి ఆ నీటిని తాగి ప్రాణాల మీదుకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.. ప్రజలు కూడా వీటి పై అవగాహన తెచ్చుకుని పరిసరాల శుభ్రత పాటించాలన్నారు.. మా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం లో ఆర్ధిక విధ్వంసం జరిగింది.. అన్ని మంత్రిత్వ శాఖలు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.. వైద్య రంగంలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయి.. వీటిపై విచారణ చేసి త్వరలో చర్యలు తీసుకుంటాం అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా నిధులు లేకుండా చేశారు.. ప్రధాని మోడీ సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం అన్నారు.
Also Read
ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. ప్రభుత్వం ముందు చర్యలు తీసుకుంది.. అక్కడక్కడా కొన్ని చోట్ల అతిసారం ప్రబలిందన్నారు మంత్రి సత్యకుమార్.. ఎన్నికల నేపథ్యంలో అక్కడ దృష్టి సారించలేదని తెలిసింది.. ఇక నుంచి ఇతర శాఖల సమన్వయం తో పని చేస్తాం.. కలుషిత నీరు వల్ల అతిసారంతో ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు.. గత కొన్ని ఏళ్లుగా ఓవర్ హెడ్ ట్యాంక్ లు, పైపు లైన్లు సరి చేయలేదని విమర్శించారు. పైపులు లీకు అయ్యి మంచినీటిలో కలిసిన పరిస్థితి ఉంది.. మా శాఖ వరకు అన్ని ప్రాంతాలలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.. ఆస్పత్రిలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నాం అన్నారు.. ఇక, వర్షాల సమయంలో కాల్చి చల్లార్చిన నీరు మాత్రమే తాగండి.. ఆరోగ్యంగా ఉండాలని సలహా ఇచ్చారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
Read Also: Producer Niranjan Reddy- Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ తో నిరంజన్ సాహసం..!
ఇక, విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడులు జరిగాయి.. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు.. శ్యాం ప్రసాద్ గురించి భావి తరాలు తెలుసుకోవాలి.. జాతి నిర్మాణం, దేశ సమైక్యతకు శ్యాం ప్రసాద్ ఎంతగానో పాటుపడ్టారు.. దేశం ప్రాధాన్యాత అని నినదించిన వ్యక్తి శ్యాం ప్రసాద్ .. విద్యారంగంలో అనేక సేవలందించారు.. శ్యాం ప్రసాద్ ముఖర్జీ మంచి దర్శనీయకుడు అని కొనియాడారు మంత్రి సత్యకుమార్ యాదవ్. మరోవైపు.. విజయవాడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు.. యనమలకుదురులో పీహెచ్సీ ప్రారంభించి స్ధానిక వైద్య అధికారులతో సమీక్షించారు. ప్రజారోగ్యం ప్రధాన ధ్యేయంగా ఉద్యోగులు పని చేయాలని ఆదేశించారు..
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!