ఆంధ్రప్రదేశ్లో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు(జూన్ 1) ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి.. జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వానికి వినతులు అందాయి.
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.
విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందడి ప్రారంభమైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విశాఖ ఎంపీ భరత్ హాజరయ్యారు.
ఏపీ సీఎం అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా నియామకమయ్యారు. కేంద్ర సర్వీసుల నుంచి ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా రిలీవయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కార్తికేయ మిశ్రా రిపోర్ట్ చేశారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు కలిశారు. ఏపీ, తెలంగాణ,పంజాబ్, ఢిల్లీకి చెందిన క్రీడాకారులు పవన్ను కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను డెప్యూటీ సీఎంకు వివరించారు. క్రీడలతో సంబంధం లేని వారికి క్రీడా సంఘాలు అందించొద్దని వినతి పత్రాన్ని అందించారు.
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్ హామీ కొంచెం లేటైనా నెరువేర్చుతామని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఏపీలో అమలు చేస్తామని వెల్లడించారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ రంగంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అవసరమైన కార్యచరణ రూపొందించాలి అని తెలిపారు.
ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసపు సారె ఇస్తారు అని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈఓ రామారావు తెలిపారు. ఆలయంలోని ఆరవ అంతస్తులో ఆషాఢ మాసపు సారెకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సారె ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
Polavaram: పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల రంగం నిపుణులు నేటి నుంచి నాలుగు రోజుల పాటు పరిశీలించనున్నారు. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు.