AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది.. ఈ నెల 22వ తేదీ లేదా ఆ తర్వాత తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు.. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం కష్టమని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. దీంతో, ప్రస్తుతమున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్టును కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.. మరో నాలుగు నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తేవాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టుగా చర్చ సాగుతోంది.. ఆర్థిక వెసులుబాటు.. వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ఇప్పుడే ప్రవేశపెట్టడం కష్టమని.. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింపుపై సమాలోచనలు చేస్తున్నారట.. అయితే, ఏపీ ఆర్ధిక పరిస్థితిపై క్లారిటీ వస్తే సెప్టెంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టుగా సమాచారం.. ఇప్పుడు మాత్రం.. ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనకు ప్రభుత్వ పెద్దల ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురుచూస్తోందని తెలుస్తోంది.
Read Also: Satya Kumar Yadav: మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు..
కాగా, ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత.. మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం విదితమే.. ఈ సెషన్ లో ఎమ్మెల్యేగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, వైసీపీ అధినేత వైఎస్ జగన్, శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.