Anakapalle Minor Girl Incident: మైనర్ బాలిక హత్య కేసు.. నిందితుడి ఆచూకీ చెబితే బహుమతి ప్రకటించిన పోలీసులు
- నిందితుడు సురేష్ కోసం వేసిన 12 బృందాలు విఫలం..?
- చేతులెత్తిసిన పోలీస్ అధికారులు..!
- నిందితుడు సురేష్ ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు పారితోషికం ప్రకటన..
- ఘటన జరిగి 48 గంటలు గడిచినా లభించని సురేష్ ఆచూకీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anakapalle Minor Girl Incident: అనకాపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడి ఆచూకీ చెబితే బహుమతి ప్రకటించారు పోలీసులు.. రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పుగొండు పాలెంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం విదితమే.. కొప్పుగొండు గ్రామంలో జులాయిగా తిరుగుతూ బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో విషయం కాస్త అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. ఆ సైకో వ్యక్తి సురేష్ పై ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపారు. ఇక 20 రోజుల కిందట బెయిల్ పై బయటకు వచ్చిన సురేష్.. తనని జైలుకు పంపించారని కక్ష మనస్సులో పెట్టుకుని దారుణానికి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మైనర్ బాలిక పై దాడి చేసేందుకు ప్లాన్ చేసిన సురేష్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ అమ్మాయి పీక కోసి పరార్ అయ్యాడు.
Read Also: Mahesh Babu: మహేష్ బాబుకి యాక్టింగ్ క్లాసులు చెబుతున్న సీనియర్ నటుడు
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
అయితే, నిందితుడు సురేష్ కోసం ఏర్పాటు చేసిన 12 బృందాలు కూడా విఫలం అయినట్టు తెలుస్తోంది.. నిందితుడిని పట్టుకోవడంలో చేతులెత్తేశారు పోలీసులు.. దీంతో.. నిందితుడు సురేష్ ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు పారితోషికం ప్రకటించారు.. ఘటన జరిగి 48 గంటలు కావస్తున్నా సురేష్ ఆచూకీ లభించలేదు.. నిందితుడు పాతవి, ప్రస్తుతం ఫోటోలు.. విడుదల చేశారు పోలీసులు.. ఇంతవరకు ఆచూకీ దొరక్కపోవడతో నిందితుడు సూసైడ్ చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. జిల్లా మొత్తం జల్లెడ పట్టినా నిందితుడి ఆచూకీ దొరకలేదంటున్నారు.. మరోవైపు పోలీసుల నిర్లక్యం పై బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నిందితుడు ఆచూకీ కనుక్కొని తమకి అప్పగించకపోతే సూసైడ్ చేసుకుంటానంటున్న హత్యకు గురైన చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Read Also: Balcony Rent: అక్కడ బాల్కనీ అద్దె నెలకు రూ. 80,000..!
కాగా, నాలుగు నెలల క్రితం మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో ఫోక్సో యాక్ట్ కింద నిందితుడు సురేష్‌ని అరెస్టు చేశారు పోలీసులు.. ఈ ఘటనలో నిందితుడు ఒక నోట్ రాసి ఈ దారుణానికి ఒడిగట్టాడని., అందులో మేటర్ ఆధారంగా కూడ దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.. ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నందున కొన్ని విషయాలు వెల్లడించలేమని., ఏప్రిల్ లో మృతురాలు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామని., కోర్టులో గుడ్ బిహేవియర్ కింద బెయిల్ మీద వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు మానసిక పరిస్థితి కూడా బాగోలేదంటున్నారు.. మొత్తంగా ఇప్పటి వరకు నిందితుడు ఆచూకీని కనిపెట్టడంలో పోలీసులు విఫలం అయ్యారని మండిపడుతున్నారు స్థానికులు.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!