కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కలిశారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చ జరిగిందని ఆయన భేటీ అనంతరం మీడియాతో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత గురించి చర్చించామన్నారు.
విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనకాపల్లిలోని రాంబిల్లిలో ప్రేమపేరుతో బాలికను చిత్రవధ చేసి హత్య చేసి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటనను మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి కత్తిదూశాడు.