అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో నిమ్మచెట్ల నరికివేతను సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. మంజుల అనే మహిళా రైతుకు చెందిన నిమ్మచెట్ల నరికివేతపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. వెలగపూడి నుండి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా వివరాలను ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా మీడియాకు వెల్లడించారు. కేసు ఇంకా విచారణ దశలో ఉందని.. బాలిక మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు. ముచ్చుమర్రిలో 7వ తేదీన బాలిక మిస్ అయిందని.. ఫిర్యాదు అందిన వెంటనే బాలిక కోసం వెతికామని ఆయన తెలిపారు.
ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి రూ. 1600 కోట్లు బకాయిలు ఉన్నాయని.. వీటిల్లో రూ. 1000 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి పేర్కొన్నారు.
తాము చెప్పినట్లుగానే అన్ని పనులూ చేస్తున్నామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి స్పందించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంశంపై అధ్యయనం చేస్తామని.. ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు తీరును పరిశీలిస్తామని మంత్రి వెల్లడించారు.
ఏపీలో జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. గత ప్రభుత్వం వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేసి జీపీఎస్ తెచ్చిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.