Polavaram Floods: పోలవరం ప్రాజెక్టులోకి క్రమంగా వరద ఉధృతి పెరిగిపోతుంది. గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు దగ్గరకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. స్పిల్ వేపైకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు తెరిచి కిందకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర 30 మీటర్‌లకు నీటి మట్టం చేరుకుంది. దిగువకు 4.84 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగితే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Read Also: Manipur : ఇంఫాల్‌లో భారీ విధ్వంసం విఫలం.. 8 ఐఈడీలను నిర్వీర్యం చేసిన సైన్యం
ఇక, పోలవరం ప్రాజెక్టులోని స్పిల్ వే దగ్గర 31.6 మీటర్ల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టులోని 48 గేట్ల నుంచి 7లక్షల 86 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. దిగువ ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. కాగా, భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం 32 అడుగులకు పెరిగి పోవడంతో.. పోలవరంలో నీటిమట్టం సాయంత్రానికి మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పాపికొండలు విహారాయాత్రను కూడా అధికారులు నిలిపివేయగా.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.