MPDO Missing Mystery: గత ఆరు రోజుల నుంచి ఎంపీడీవో వెంకటరమణ ఏమయ్యారు..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆరు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిన ఎంపీడీవో.. బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షల రూపాయల బకాయి చెల్లించటం లేదని వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఒత్తిడితో సూసైడ్ చేసుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు మెసెజ్ చేసిన ఎంపీడీవో.. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారిన ఎంపీడీవో మిస్సింగ్ వ్యవహారం.
అయితే, ఎంపీడీవో వెంకటరమణ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఏలూరు కాల్వలో దూకాడని మూడు రోజులు కాల్వలో పోలీసులు గాలించారు. కాల్వలో దూకితే ఇన్ని రోజులుగా మృతదేహం దొరకకుండా ఉండదని చెబుతున్న పోలీసులు.. అసలు కాల్వలో దూకాడా లేదా అనే కోణంలో రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఆరు రోజులుగా ఎంపీడీవో మిస్సింగ్ కేసులో పురోగతి లేకపోవటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీడీవో కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలపై పోలీసులు జల్లెడ పడుతున్నారు. వెంకట రమణ సన్నిహితులు, స్నేహితులను కూడా విచారిస్తున్నారు. ఎంపీడీవో మిస్సింగ్ కు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని కూడా లోతుగా పోలీసులు విచారణ చేస్తున్నారు.