ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లు శాకంబరీ దేవీగా దర్శనం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారు జాము నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆషాఢ మాసం సారె సమర్పించే వారు కూడా వస్తుండటంతో ఆలయం కిటకిటలాడుతుంది.
Read Also: Ujjaini Mahankali Bonalu 2024: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి!
ఇక, నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంకా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసి ఉంది. ఉచిత బస్సుకు మాత్రమే ఘాట్ రోడ్డుపై వెళ్ళే అవకాశం కల్పించారు అధికారులు.. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉన్నారు.. కొండ దిగువన భక్తులకు తప్పని పార్కింగ్ కష్టాలు.. వీఎంసీ దగ్గర హాల్టింగ్ పాయింట్, దుర్గాఘాట్, కెనాల్ రోడ్డు, సీతమ్మ పాదాల దగ్గర పార్కింగ్ కేటాయించారు.
Read Also: Flood Effect: చింతూరులో పోటెత్తిన వరద.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య నిలిచిన రాకపోకలు..!
అలాగే, ఇవాళ శ్రీశైల భ్రమరాంబికా దేవికి శాకంబరీ ఉత్సవం కొనసాగుతుంది. ఆశాడ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి ఆకుకూరలు, కూరగాయలతో అలంకరణ చేసేశారు. అమ్మవారితో పాటు రాజ రాజేశ్వరి, సప్తమాతృకలు, గ్రామ దేవతలకు కూడా శాకాంబరీ అలంకరణ చేశారు.