ఏపీ రాజధానికి జాతీయ రహదారికి అనుసంధానం చేసే అంశపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్హైవేతో అనుసంధానం చేసేలా సీడ్ యాక్సిస్ రోడ్ తరహాలో మరో రెండు రోడ్ల నిర్మాణానికి సీఆర్డీయే ప్రణాళికలు రచిస్తోంది.
గుంటూరు కార్పొరేషన్లో సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చేకూరి కీర్తి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్ను ప్రభుత్వం నియమించింది. సార్వత్రిక ఎన్నికల ముందు జమ్మలమడుగు డీఎస్పీగా యశ్వంత్ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలు నిక్కచ్చిగా జరిపారని యశ్వంత్ పేరు పొందారు.
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ జెన్కో ప్రారంభించింది. ఉదయం ఏపీ జెన్కో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగానే తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు.