Flood Effect: గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద ప్రవాహాం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కుంట దగ్గర జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తింది. ఈ వరద దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎటు వెళ్లే మార్గం లేక వరద నీటిలోనే వాహనాలు ఆగిపోయాయి. ఒక పక్క గోదావరి, మరోవైపు శబరి నది పొంగి పొర్లడంతో జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
Read Also: Mr.Bachchan: గబ్బర్ సింగ్ నువ్వా ..నేనా..తెలియాలంటే చూడాల్సిందే..?
ఇక, విలీన మండలాల్లో పలు చోట్ల రహదారులపైకి వరద నీవరు వచ్చి చేరింది. ఏటపాక, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల దగ్గరకు వరద నీరు చేరుతుంది. ముంపు ప్రాంతాల్లో పోలవరం నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.