ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ఏపీ సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించారు. భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏపీ సీఎం చంద్రబాబు ఎంపీలకు వివరించారు. జగన్ ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారనే విషయాన్ని ఎంపీలకు సీఎం చంద్రబాబు వివరించినట్లు సమాచారం.
బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బాధ్యులైన అధికారుల్ని ఉపేక్షించబోనని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. వర్షాలు పడుతుండడం, వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండడంతో తక్షణమే హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అల్లూరి ఏజెన్సీ ఘాట్లలో వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. నేడు సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.
రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎంపీలకు కొన్ని కొన్ని శాఖలు కేటాయించారని.. కేటాయించిన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలపై ఉందన్నారు. వివిధ స్కీంల వచ్చే కింద కేంద్ర నిధులను ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.
విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. సింహాచలం గిరి ప్రదక్షిణను దేవస్థానం శాస్త్రోక్తం ప్రారంభించింది. వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి పూల రథాన్ని జెండా ఊపి ఆలయ అనువంశిక ధర్మకర్త, చైర్మన్ అశోక్ గజపతి రాజు ప్రారంభించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ 18వ మలుపు వద్ద వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.