ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వాసెపల్లిపాడులో విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు నవీన్(22),వెంకటేష్ (22)లుగా గుర్తించారు. టంగుటూరు మండలం పెళ్లూరు చెరువులో గురువారం ఈత కొట్టేందుకు వెళ్లి ఆ ఇద్దరు యువకులు చెరువు గుంటలో పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ రాజమౌళి నియమితులయ్యారు. ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన సీనియర్ ఐఏఎస్ రాజమౌళి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆయన రిపోర్ట్ చేసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యదర్శిగా పోస్టింగ్ లభించింది.
బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది రేపు తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడనుంది.
ఏపీలో జరుగుతున్న దాడులపై మోడీని కలుస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లాలో వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సమస్యల కారణంగా విమాన సేవలు ప్రభావితమయ్యాయి. చాలా కంపెనీల విమానాలు ఎగరలేకపోతున్నాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి.